ప‌వ‌న్: ఇక్కడ వర్షపాతం కంటే రక్తపాతం ఎక్కువ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేస్తున్నాడు..!!

పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్లో ఓజి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియ అరుళ్‌ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. జపాన్ – ముంబై బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న‌ ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

ఇటీవల తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ మూవీ టీం రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం తెలిపారు. దీంతోపాటూ ఓ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు మూవీ టీం. ఇందులో పవన్ కళ్యాణ్ తన గ్యాంగ్ తో కలిసి శత్రువులను చంపి అక్కడ నుంచి వెళ్తూ కనిపిస్తారు. ఇక ఈ పోస్టర్ పై లొకేషన్ : చర్చ్ గేట్, సౌత్ బొంబాయి, టైం : 2:19am రైన్ ఫాల్ డెన్సిటీ : 24 mm బ్లడ్ ఫాల్‌ డెన్సిటీ : 32 mm వెపన్స్ యూజ్డ్ సేవ్డ్ ఆఫ్ టేబుల్, పెరల్ షార్ట్ గన్‌ అంటూ కొన్ని ఆసక్తికర వివరాలను పొందుపరిచారు.

దీన్నిబట్టి ఇక్కడ వర్షం నీరు ప్రవాహం కంటే రక్త ప్రవాహం ఎక్కువగా ఉందని హింట్ ఇచ్చారు. అలాగే # ఫైర్ స్ట్రామ్ ఇస్‌ కమింగ్(హిట్ వేవ్‌ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి) అనే టాగ్‌ తో ఈ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌ విడుదల చేసే అవకాశం ఉంది.