WDగాండీవధారీ అర్జున టీజర్ తో దుమ్ము దులిపేస్తున్న వరుణ్ తేజ్..!!

డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గాండీవ దారి అర్జున.. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ లో తెరకేక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెంబర్ బిఫోర్ అనే క్యారెక్టర్లు మరొకసారి కనిపించబోతున్నారు. వరుణ్ తేజ్ ఇందులో కూడా మరొకసారి సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో హీరోయిన్గా సాక్షి వైద్య నటిస్తోంది.ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను సైతం విడుదల చేయడం జరిగింది.

Gandeevadhari Arjuna Movie (Aug 2023) - Trailer, Star Cast, Release Date |  Paytm.com

క్లిష్టమైన పరిస్థితులలో టార్గెట్ అయిన వ్యక్తి కోసం ఆఫీసర్లు అర్జునుని రంగంలోకి దింపడం ఈ టీజర్ లో కనిపిస్తోంది. అతనితో కలిసి వర్క్ చేయడం హీరోయిన్ కి నచ్చకపోయినా అతనితో సెట్ అవ్వడం లేదని చెబుతూ ఉంటుంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నీ వేషాలు చాలా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.కొన్ని షాట్స్ అయితే చాలా హైలైట్ గా ఉండబోయేలా కనిపిస్తున్నాయి. సీక్రెట్ గా లక్షల కోట్ల వ్యాపారం చుట్టూ జరిగే ఒక స్కామ్ లో హైలైట్ అయ్యేలా ఈ సినిమా కథని తెరకెక్కించినట్లు తెలుస్తోంది ప్రవీణ్ సత్తార్.

ఇక హాలీవుడ్ హీరోల తరహాలో ఎక్కువగా యాక్షన్ లుక్కుతోనే అదరగొట్టేస్తున్నారు వరుణ్ తేజ్.. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగానే హైలెట్ అయ్యేలా చేస్తున్నారు. డైరెక్టర్ ఈ తరహా కాన్సెప్ట్లు గతంలో బాగానే సక్సెస్ అయ్యాయి.. గరుడవేగ సినిమాతో పాటు నాగార్జున ది ఘోస్ట్ హీరోయిన్ సినిమా తరహాలో ఏ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. మరి సరికొత్త లుక్కుతో టచ్ చేసిన వరుణ్ తేజ్.. గాండీవ దారి అర్జున సినిమాతో సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.