ఈ వారం చిన్న చిత్రాలదే హవా..ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే ఎంత హడావిడి ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ఆ తరువాత నిఖిల్ నటించి స్పై సినిమా కూడా భారీగా విడుదలైంది. అదే రోజు సామజవరాగమనా సినిమా కూడా విడుదలైంది. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 చిత్రాలు థియేటర్ లోకి రానున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం.

ఈ వారంలో విడుదలయ్యే సినిమాల్లో అందరి చూపు ముందు రంగబలి సినిమా మీద ఉంటుందనే చెప్పాలి. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తుండగా, యుక్తి తరేజా, సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, షైన్‌ టామ్‌ చాకో తదితరులు సినిమాలో సందడి చేయనున్నారు. ఈ సినిమాకి పవన్‌ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తుండగా పవన్ సీహెచ్‌ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ సినిమా 07-07-2023 విడుదల కానుంది.

ఈ వారమే భాగ్‌ సాలే సినిమా కూడా విడుదల అవుతుంది. ఇందులో శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి, వైవా హర్ష, రాజీవ్‌ కనకాల, జాన్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. నిర్మాత: అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కల్యాణ్ సింగనమల. ఈ సినిమాకి ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 07-07-2023 విడుదల కానుంది.

రుద్రంగి సినిమా కూడా ఈ వారమే థియేటర్ లల్లోకి రానుంది. ఈ సినిమాలో జగపతిబాబు, మమతా మోహన్‌దాస్‌, విమలారామన్‌, ఆశిష్ గాంధీ తదితరులు నటిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నోఫెల్‌ రాజా సంగీతం అందిస్తుండగా ఈ సినిమాని రసమయి బాలకిషన్‌ నిర్మిస్తున్నారు. రచన, దర్శకత్వం: అజయ్‌ సామ్రాట్‌. ఈ సినిమా 07-07-2023 విడుదల కానుంది.

ఈ వారంలో ఇద్దరు అనే సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో అర్జున్‌, జేడీ చక్రవర్తి, సోనీ చరిష్ట, కె.విశ్వనాథ్‌, సమీర్‌ తదితరులు నటించారు. సంగీతం: సుభాష్‌ ఆనంద్‌; నిర్మాత: ఫర్హీన్‌ ఫాతిమా; దర్శకత్వం: ఎస్‌ఎస్‌ సమీర్‌; ఈ సినిమా 07-07-2023 విడుదల కానుంది.

ఈ వారంలో మరో ఇంట్రెస్టింగ్ సినిమా విడుదల కానుంది. అదే సర్కిల్‌. ఇదివరకే వచ్చిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాయి రోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్‌ మెహతా, రిచా పనాయ్‌, నైనా నటింస్తున్నారు. ఈ సినిమాకు ఎన్‌.ఎస్‌. ప్రసు సంగీతం అందిస్తున్నారు. నిర్మాత: ఎం.వి.శరత్‌ చంద్ర, టి.సుమలత అన్నిత్‌ రెడ్డి, వేణుబాబు అడ్డగడ; నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. విడుదల తేదీ: 07-07-౨౦౨౩

మరో చిన్న సినిమా ఓ సాథియా కూడా ఈ వారమే విడుదల కానుంది. ఈ సినిమాలో ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి, తదితరులు నటిస్తుండగా ఈ సినిమాకి విన్ను సంగీతం అందిస్తున్నారు. చందన కట్టా నిర్మిస్తుండగా దివ్య భావన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 07-07-2023 విడుదల కానుంది.

మోహన్‌కృష్ణ గ్యాంగ్‌లీడర్‌ కూడా ఈ వారమే విడుదల కానుంది. ఈ సినిమాలో మోహన్‌కృష్ణ, సౌజన్య, హరిణిరెడ్డి తదితరులు నటించారు; సంగీతం: ఘన శ్యామ్‌; నిర్మాత, దర్శకత్వం: సింగలూరి మోహన్‌రావు; విడుదల తేదీ: 07-07-2023

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న 7.11 PM సినిమా కూడా ఈ వారమే థియేటర్ లోకి రానుంది. నటీనటులు: సాహస్‌, దీపిక. సంగీతం: జ్ఞాని, నిర్మాతలు: నరేన్‌ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి; దర్శకత్వం: చైతు మాదాల; విడుదల తేదీ: 07-07-2023

ఈ వారం మరో చిన్న సినిమా విడుదల కానుంది. నాతో నేను అనే సినిమా రిలీజ్ కానుంది; నటీనటులు: సాయికుమార్‌, శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్‌, ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల తదితరులు; సంగీతం: సత్య కశ్యప్‌; నిర్మాత: ప్రశాంత్‌ టంగుటూరి; దర్శకత్వం: శాంతికుమార్‌ తుర్లపాటి. ఈ సినిమా 07-07-2023 విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మరో సినిమా జులై 6 వ తేదీ విడుదల కానుంది. ఆ చిత్రమే ఇన్సీడియస్‌: ది రెడ్‌ డోర్‌.