అప్పుడు నో చెప్పి ఇప్పుడు బాధపడుతున్న రష్మిక.. అసలు విషయం ఏమిటంటే..?

కన్నడ సినీ ఇండస్ట్రీలో మొదట కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది రష్మిక.కేవలం పుష్ప సినిమాతోనే ఒక్కసారిగా ఈమె కెరియర్ మారిపోయింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈమె డేట్స్ అడ్జస్ట్ కాక దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను వదులుకున్నట్లు తెలుస్తోంది.

Crazy Heroine to Shake Her Leg with Chiru! | cinejosh.com

ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో తాను కొన్ని సినిమాలను వదిలేయాల్సి వచ్చిందని టాలీవుడ్, కోలీవుడ్లో పెద్ద హీరోలతో నటించే అవకాశం వచ్చిన వదులుకోవాల్సి వచ్చిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ విషయాలను పంచుకుంది.. రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చాలా అదృష్టం ముఖ్యమని తెలియజేసింది.గతంలో చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమా లో తనకి అవకాశం వచ్చిందని కానీ కొన్ని కారణాల చేత వదిలేయవలసి వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమాను కూడా రిజెక్ట్ చేశానని తెలిపింది.

Super hit heroine with Vijay in 'Dalapati 65'! - World Today News

స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని వదులుకోవడం ఇప్పటికి తనకి బాధగా అనిపిస్తోందని తెలియజేసింది. కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా సరే టాప్ పోసిషన్ లోకి వెళ్తామని తెలియజేస్తోంది రష్మిక.తాను మొదట ముందుగా మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించాలని ఆ తరువాత హీరోయిన్గా ఎదిగానని తెలియజేస్తోంది రష్మిక ప్రస్తుతం హిందీలో యానిమల్ సినిమాలు నటిస్తున్నాను ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారని తెలిపింది అలాగే తెలుగులో పుష్ప-2 చిత్రంలో కూడా నటిస్తున్నది.