ఈ బాలయ్య సినిమాలో సింగల్ ఫైట్ కూడా ఉండదు.. కానీ బంపర్ హిట్ అయింది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలయ్య మాస్ యాక్షన్ సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బాలయ్య పేరు వింటే చాలు ఆయన ఫ్యాన్స్ కి పూనకాలు వస్తుంటాయి. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ బాలయ్య మాత్రం యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు  సంపాదించుకున్నాడు.


బాలయ్య ఫ్యాన్స్ ఎక్కువగా ఆయన సినిమాలో వచ్చే ఫైట్స్ ని ఇష్టపడుతుంటారు. బాలయ్య నటించే సినిమాల్లో  ఫైట్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనే చెప్పాలి. ఆయన సినిమాలకు ఆ సీన్స్ హైలెట్ గా మారుతుంటాయి. దర్శకులు కూడా బాలయ్య అభిమానులకు నచిన్నట్లుగా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ ని ఎక్కువగా పెడుతుంటారు. అలాంటి ఫైట్ సీన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన బాలయ్య నటించిన ఒక సినిమాలో మాత్రం అసలు ఫైట్ సీన్స్ లేవంటే మీరు నమ్ముతారా?.


బాలకృష్ణ కెరీర్ లోనే ఒక ఫైట్ సీన్ కూడా లేని సినిమా ఏకంగా బ్లాక్బస్టర్ హిట్ అయింది అని మీకు తెలుసా . ఆ సినిమా ఇంకేదో కాదు ‘నారి నారి నడుమ మురారి’. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శోభన,నిరోష  హీరోయిన్లుగా నటించారు. యువచిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై కె.మురారి ఈ సినిమాను నిర్మించారు. నారి నారి నడుమ మురారి సినిమా 1990లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో కనీసం ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ హౌస్ లో జరిగింది.