తెలుగు హీరోల ప్రస్తుత రెమ్యునరేషన్స్‌ ఎంతో తెలిసిపోయింది.. ఆ హీరోకి ఎంత తక్కువ అంటే..

టాలీవుడ్ హీరోలకు ఎంత మంది అభిమానులు ఉంటారనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అభిమానులు వారి ఫేవరెట్ హీరో కి సంబందించిన ఏ విషయం అయిన తెలుసుకోడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. మరి మనం ఇప్పుడు తెలుగు స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్స్‌ గురించి తెలుసుకుందామా ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ k, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఒక్కో సినిమాకి 100 నుండి 150 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి రూ.60 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో సినిమాకి రూ.55 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాకు మహేష్ రూ.60 నుంచి 80 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉందట. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘దేవర’ సినిమాకి రూ. 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ సినిమాకి రూ.60 కోట్లు తీసుకుంటుండగా, చిరంజీవి భోళా శంకర్ సినిమాకి రూ. 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 కి రూ. 80 కోట్లు, బాలకృష్ణ తాను నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాకి రూ.15 కోట్లు తీసుకుంటున్నాడు. నేచరల్ స్టార్ నాని దసరా సినిమాకి రూ.20 కోట్లు తీసుకోగా, రవితేజ ఒకో సినిమా కి రూ.20 కోట్లు, వరుణ్ తేజ్ రూ. 8 కోట్లు, శర్వానంద్ రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు.