`బేబీ` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. ఊహ‌కంద‌ని ఊచ‌కోత ఇది!

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ నుంచి తాజాగా వ‌చ్చిన చిత్ర‌మే `బేబీ`. ఇందులో యూట్యూబ్ స్టార్ వైష్ణ‌వ్ చైత‌న్య హీరోయిన్ గా న‌టిస్తే.. విరాజ్ అశ్విన్, నాగబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి సాయి రాజేష్ ద‌ర్శ‌కుడు.

లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న బేబీ.. జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ల‌వ్ స్టోరీల‌న్నీ ఒకేలా ఉన్నా.. బేబీ మాత్రం ఫ్రెష్ ఫీలింగ్ ను అందిస్తుంది. యూత్ కు బాగా క‌నెక్ట్ అవుతుంది. ఇక క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ మించిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసింది.

రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన బేబీ.. ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.60 కోట్ల షేర్‌, రూ. 4.65 గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుని దుమ్ము దుమారం రేపింది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 3.48 కోట్ల షేర్‌, రూ. 6.55 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇంకా రూ. 4.52 కోట్ల రేంజ్ లో షేర్ ని వ‌సూల్ చేస్తే బాక్సాఫీస్ వ‌ద్ద బేబీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. కాగా, ఏరియాల వారీగా బేబీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి..

నైజాం: 1.20 కోట్లు
సీడెడ్: 31 లక్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 42 లక్ష‌లు
తూర్పు: 18 లక్ష‌లు
పశ్చిమ: 11 లక్ష‌లు
గుంటూరు: 15 లక్ష‌లు
కృష్ణ: 15 లక్ష‌లు
నెల్లూరు: 8 లక్ష‌లు
—————————————————–
ఏపీ+తెలంగాణ = రూ. 2.60కోట్లు(రూ. 4.65కోట్లు~ గ్రాస్)
—————————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా= 10 లక్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 78 లక్ష‌లు
————————————————
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్షన్స్‌= రూ. 3.48 కోట్లు(రూ. 6.55కోట్లు~ గ్రాస్)
————————————————