హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కుమారుడు..!!

తమిళ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో విజయ్ దళపతి. ఇయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళ్ , తెలుగులో ఎంతో మంచి ఫాలోయింగ్ నీ పెంచుకున్నాడు విజయ్. ఇప్పుడు విజయ్ సినిమా తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్నాయి. టాలీవుడ్ లో అయితే తుపాకీ సినిమా నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. కలెక్షన్ల విషయంలో కూడా పలు రికార్డులను సృష్టిస్తూ ఉంటారు.విజయ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ కావాలని అనుకుంటున్నారు. అందుకోసమే ఇప్పుడు సినిమాలను కాస్త పక్కకు పెట్టి రాజకీయాల్లో బిజీగా గడిపేయాలని అనుకుంటున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

Actor Vijay's son Jason Sanjay to make his debut in Tamil cinema with THIS  director? | Tamil Movie News - Times of India

ఇదిలా ఉండగా చాలా మంది హీరోల కుటుంబం నుంచి తన వారసత్వాలను దించుతారు. అలాగే విజయ్ కూడా తన కొడుకును సినీ రంగంలోకి దించబోతున్నాడని సమాచారం.. విజయ్ కొడుకు పేరు సంజయ్ అయితే విజయ్ కు జోడిగా ఓ స్టార్ హీరోయిన్ కూతురు నటించబోతుందని టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది .ఆమె ఎవరో కాదు సార్ హీరోయిన్ దేవయాని కూతురు ఇనియకుమార్.

కానీ విజయ్ కొడుకు సంజయ్ ,ఇనియకుమార్ జోడిగా దేవయాని భర్త రాజకుమార్ చూస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. మరి విజయ్ దళపతి కుమారుడు సినీ ఎంట్రీ పై ఎవరు క్లారిటీ ఇస్తారు చూడాలి మరి.. రాజ్ కుమార్ అన్నట్టుగా వీరిద్దరూ సినిమాలో నటిస్తారేమో.. అలాగే సంజయ్ తన తండ్రికి లాగే మంచి పొజిషన్లో ఉండి ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి మరి. అయితే ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు సైతం తెగ సంబర పడిపోతున్నారు. తండ్రిని మించిపోయినట్టు అవుతారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ విజయ్ కుమారుడు ఎంట్రీ ఇస్తే రాబోయే రోజుల్లో తండ్రి కొడుకులు నటిస్తారేమో అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.