`ఇస్మార్ట్ శంక‌ర్‌` ఈజ్ బ్యాక్.. రామ్ న్యూ లుక్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

ఇస్మార్ట్ శంక‌ర్.. రామ్ పోతినేని కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తిండిపోయే చిత్రం. ఈ మూవీతోనే వ‌రుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన రామ్ స్ట్రోంగ్ కాంబ్యాక్ ఇచ్చాడు. అలాగే ఈ మూవీతోనే మాస్ హీరోగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంక‌ర్ కు ఇప్పుడు సీక్వెల్ గా `డ‌బుల్ ఇస్మార్ట్‌` రాబోతోంది. రామ్-పూరీ జ‌గ‌న్నాథ్ కాంబో మ‌రోసారి రిపీట్ కాబోతోంది. వీరి కాంబోలో ప్రాజెక్ట్ హైద‌రాబాద్ లో జూలై 10న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ఛార్మీ, పూరీ జ‌గ‌న్నాథ్ క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రంలో డబుల్ యాక్ష‌న్‌, డబుల్ ఎంటర్టైన్మెంట్, డ‌బుల్ మ్యాడ్‌నెస్గాఉండబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 12 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నేప‌థ్యంలోనే రామ్ త‌న లుక్ ను మార్చేశాడు.

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ `స్కంద‌` షూటింగ్ కంప్లీట్ ఇవ్వ‌డంతో.. రామ్ `డ‌బుల్ ఇస్మార్ట్‌` కోసం మేకోవ‌ర్ అయ్యాడు. బోయపాటి సినిమా కోసం జుట్టు, గడ్డం బాగా పెంచిన రామ్.. ఇప్పుడు ఇస్మార్ట్ లుక్‌లోకి మారిపోయాడు. సెలూన్ లో రామ్ హెయిర్ స్టైల్ మార్చిన వీడియోను నిర్మాత ఛార్మీ `ఇస్మార్ట్ శంకర్ ఈస్ బ్యాక్` అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో రామ్ న్యూ లుక్ చూస్తూ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. `డ‌బుల్ ఇస్మార్ట్‌` కోసం వెయింటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)