నాగబాబుని ఎదిరించిన లావణ్య.. అది నిహారికకే వదిలేయాలి అంటూ పెద్ద గొడవ!!

కొణిదెల నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. నిహారిక 2020, డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకుంది. రెండేళ్ల వీరి వివాహ బంధంలో కొన్ని కారణాల వల్ల నిహారిక చైతన్య నుంచి విడిపోవాలని కోరుకుంది. మెగా కుటుంబం నిహారిక పెళ్లిని ఎంతో ఘనంగా జరిపారు. కానీ ఇప్పుడు నిహారిక తన భర్తతో విడాకులు తీసుకోవడం మెగా కుటుంబంలో భరించలేని బాధను మిగిల్చింది.

అయితే పెళ్లయిన రెండేళ్లకే భర్తతో విడాకులు తీసుకుంటుందనే విషయాన్ని స్వయంగా నిహారికనే ప్రకటించింది. దాంతో ఆ విషయంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవలే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి చేసుకొని ఒకటి కానున్నారనే సంతోషం ఒకవైపు, నిహారిక తన భర్తతో విడాకులు తీసుకుందనే బాధ మరోవైపు మెగా కుటుంబ సభ్యులనే కాకుండా, అభిమానులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇంకా కొన్ని రోజుల్లోనే లావణ్య మెగా ఇంటి కోడలు కాబోతుంది. కాబట్టి నిహారిక విషయంలో లావణ్య, నాగబాబుని ఎదురించి ఎవరూ ఊహించని ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిహారిక విడాకుల విషయం పై నాగబాబు చాలా కోపంగా ఉన్నారట. అంతేకాదు నిహారికని తన ఇంటికీ కూడా రావొద్దని నాగబాబు కోపగించుకున్నట్లు సమాచారం. దాంతో నిహారిక విషయంలో లావణ్య కల్పించుకొని ‘తప్పు ఇద్దరివైపు ఉంటుంది. అందుకే నిహారిక, చైతన్య తో అడ్జెస్ట్ కాలేకపోయింది. అందుకే విడాకులు తీసుకుని ఉంటుంది. ఇలాంటి సమయంలో మనం నిహారికకి సపోర్ట్ చెయ్యాలి’ అంటూ పెళ్లి కాకముందే మామగారి నిర్ణయానికి ఎదురు తిరిగింది లావణ్య.