ప్రభాస్ సలార్ సినిమా స్టోరీ లీక్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగాలేదుగా..!!

కే జి ఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ kసినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపుగా రూ .250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని హోం భలే ఫిలిం బ్యానర్ వారు తెరకెక్కిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతున్న తరుణంలో ఈ సినిమా కోసం పలు రకాల అప్డేట్లను చిత్ర బృందం విడుదల చేస్తూనే ఉంది.

Spectacular rumour about Prabhas' 'Salaar' - Telugu News - IndiaGlitz.com

ఇటీవల విడుదలైన టీజర్ కూడా యూట్యూబ్ ను షేక్ చేసే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైలాగులు రిలీజ్ చేయకపోయినా టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అయితే ప్రభాస్ ఇందులో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కేజిఎఫ్ చిత్రంతో లింక్ అయి ఉంటుందని అంతేకాకుండా ప్రభాస్ సలార్ -2 భాగాలుగా ఉండబోతుందని తెలియజేశారు. ఇప్పుడు సలార్ స్టోరీ ఇదే అంటూ ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సున్నపురాయి మైనింగ్ ఫార్మా మాఫియా నేపథ్యంలో యూఎస్ ఆర్మీతో కనెక్ట్ అయి ఉంటుందట ప్రభాస్ యూఎస్ఏ ఆర్మీతో చేసే పోరాట సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.1980 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ సినిమా కోసం కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇటలీలో చిత్రీకరించారని తెలుస్తోంది.అలాగే స్టోరీ లైన్ లో కొన్ని ఎలివేషన్స్ కేజీఎఫ్ చాప్టర్-2 లింక్ అయి ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉన్నది.