నా ఫస్ట్ క్రష్ ఆ హీరోనే.. అత‌నే నా భ‌ర్త‌గా రావాలంటూ మృణాల్ ఓపెన్ కామెంట్స్‌!

మృణాల్ ఠాకూర్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌త ఏడాది సీతారామం మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిన ఈ బాలీవుడ్ భామ‌.. ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. రీసెంట్ గా బోల్డ్ వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్ 2`తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

టాలీవుడ్ లో ఇప్పుడు న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా ఓ సినిమా చేస్తోంది. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌రుశురామ్ కాంబినేష‌న్ లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలోనూ మృణాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు కూడా మృణాల్ చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ అందాల సోయ‌గం రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ కి సంబంధించి అనేక విష‌యాల‌ను పంచుకుంది.

ఈ క్ర‌మంలోనే నా ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో బ‌య‌ట పెట్టింది. త‌న‌కు ఎలా భ‌ర్త రావాలో వివ‌రించింది. ఇంత‌కీ మృణాల్ ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో తెలుసా.. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ అట‌. షాహిద్ క‌పూర్ అంటే చాలా ఎంతో ఇష్టమని, అత‌నే నా ఫస్ట్ క్రష్ అంటూ మృణాల్ వెల్ల‌డించింది. ఇండస్ట్రీలోకి రాకముందు షాహిద్ ఫోటోలు ఎక్కడ కనిపించినా కూడా కట్ చేసి బుక్ లో పేస్ట్ చేసేద‌ట‌. షాహిద్ క‌పూర్ అంటే అంత అభిమాన‌మ‌ట‌. త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ అయిన షాహిద్ క‌పూర్ తో మృణాల్ `జెర్సీ` మూవీ చేసింది. ఇక భవిష్యత్తులో తన వృత్తిని పూర్తిగా అర్థం చేసుకుని త‌న‌ను గౌర‌వించే, ప్రేమించే వాడే భ‌ర్త‌గా రావాలంటూ మృణాల్ తెలిపింది. దీంతో ఈమె వ్యాఖ్య‌లు కాస్త వైర‌ల్ గా మారాయి.