చీర‌లో చూపుతిప్పుకోకుండా చేస్తున్న లావ‌ణ్య త్రిపాఠి.. పెళ్లి క‌ళ ఉట్టి ప‌డుతోంది!

అందాల రాక్షసి మూవీతో య‌వ‌త గుండెల్లో గుబులు రేపిన డెహ్రాడూన్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అనేక చిత్రాల్లో న‌టించింది. స్టార్ హోదాను అందుకోలేక‌పోయినా.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూనే ఉంది.

ప్ర‌స్తుతం త‌మిళంతో పాటు తెలుగులోనూ ప‌లు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న లావ‌ణ్య త్రిపాఠి.. త్వ‌ర‌లోనే మెగా కోడ‌లు కాబోతోంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో ఏడ‌డుగులు వేయ‌బోతోంది. గ‌త కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట‌.. ఇటీవ‌ల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది చివ‌ర్లో వీరిద్ద‌రి వివాహం జ‌ర‌గబోతోంది.

ఇక‌పోతే లావ‌ణ్య త్రిపాఠి తాజా ఫోటోషూట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఉల్లిపొర లాంటి వైట్ క‌ల‌ర్ చీర‌లో దేవ‌క‌న్య‌లా ముస్తాబై ద‌ర్శ‌న‌మిచ్చింది. త‌న అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. లావ‌ణ్య తాజా ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు పెళ్లి క‌ళ ఉట్టి ప‌డుతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)