ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే ..బ్రో సినిమా అట్టర్ ఫ్లాపేనా..?

ప్రజెంట్ మెగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా “బ్రో ది అవతార్”. టాలీవుడ్ పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా వినోదయ సీతం సినిమాకి పూర్తిగా రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

అక్కడక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని తెలుగు జనాలకి నచ్చే విధంగా తెరకెక్కించారు సముద్రఖని. కాగా ఈ సినిమా మరికొద్ది గంటలో థియేటర్లో రిలీజ్ కాబోతుంది అన్న క్రమంలో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . గతంలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మల్టీస్టారర్ మూవీ ఆచార్య లాగే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మారే ఛాన్సెస్ ఎక్కువుగా ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.

మెగా ఫ్యామిలీకి మల్టీ స్టార్ సినిమాలు కలిసి రావని ..ఈ క్రమంలోనే గతంలో శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో పవన్ కళ్యాణ్ – చిరంజీవి నటించినా.. అలాగే నాగబాబు -చరణ్ ఆరేంజ్ సినిమాలో కలిసి నటించారు..ఆచార్య సినిమాలో చరణ్-చిరు కలిసి నటించారు.. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయిందని ఒకవేళ అదే సెంటిమెంట్ రిపీట్ అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ బ్రో సినిమా ఎలాంటి రిజల్ట్ తెస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!