ఓటీటీ లవర్స్‌కి పండగే.. ఒకే రోజు 22 సినిమాలు రిలీజ్..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వానలు కురుస్తున్నాయి. ప్రజలు బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి టైంలో ఎవరైనా తిని ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడైనా బోర్ కొడితే కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్లు చూస్తుంటారు. అలా కొత్త సినిమా, వెబ్ సిరీస్ ల కోసం ఎదురు చూసే వారికి ఈ వారం పెద్ద పండగే అని చెప్పాలి. జులై 27న చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. వాటిలో సామజవరగమన, స్పై,నాయకుడు లాంటి సినిమాలతో పట్టిగా వెబ్ సిరీస్ లు కుడా ఉన్నాయి.

‘ద ఫ్లాష్’ అనే ఇంగ్లీష్ సినిమా ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా జులై 28 శుక్రవారం రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో విడుదల కానుంది.

ఇక తెలుగు మూవీ అయిన ‘ స్పై ‘ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో జులై 28 న రిలీజ్ కాభోతుంది.

‘ ఏ ఫెర్ఫెక్ట్ స్టోరీ ‘ అనే స్పానీష్ వెబ్ సిరీస్ జులై 28 న నెట్ ఫ్లిస్ లో రిలీజ్ కాభోతుంది.

‘కెప్టెన్ పాల్’ అనే ఇంగ్లీష్  సిరీస్ జులై 28 న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాభోతుంది. అలానే D. p. సీజన్ 2 అనే కొరియన్ సిరీస్, హెడ్డిన్ స్ట్రైక్ అనే ఇంగ్లీష్ సినిమా, హౌ టు బికమ్ ఎ కల్ట్ లీడర్ అనే ఇంగ్లీష్ సిరీస్, మీరాక్యూలస్ : లేడీ బగ్ & క్యాట్ నోయిర్, ధ మూవీ అనే ఫ్రెంచ్ మూవీ,’ ద టైలర్ సీజన్ 2′ అనే టర్కీష్ సిరీస్, ద విచర్ సీజన్ 3 :పార్ట్ 2 అనే ఇంగ్లీష్ సిరీస్, తెలుగు డబ్బింగ్ సినిమా అయిన ‘ నాయకుడు ‘,  ద లేడీ ఆఫ్ సైలెన్స్ :ద మటవిట్టస్ మర్డర్స్ అనే స్పానిష్ మూవీ, పారడైజ్ అనే ఇంగ్లీష్ సినిమా, టుడే వుయ్ అల్ టాక్ అబౌట్ ది డే అనే ఇండోనేసియాన్ సినిమా, ద మిర్డరర్ థాయ్ సినిమా, హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ అనె ఇంగ్లీష్ సినిమా జులై 28న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాభోతున్నాయి.

ఇక తెలుగు సినిమా అయిన ‘సామజవరగమన’ జులై 28న ఆహ రిలీజ్ కాబోతుంది.

పోలీస్ స్టోరీ : కేస్ 1: నైట్ ఔల్స్ అనే తెలుగు సినిమాజులై 28 న ఈ – విన్ లో రిలీజ్ కాభోతుంది.

అలానే వన్ ఫ్రైడే నైట్ అనే హిందీ సినిమా, అప్పత అనే తమిళ సినిమా, కాలాకూట్ హిందీ సిరీస్ జులై 28 న జెయో సినిమా లో రిలీజ్ కాభోతున్నాయి.

సోనీ లివ్ లో ట్విస్టెడ్ మెటల్ అనే ఇంగ్లీష్ సిరీస్ జులై 28న రిలీజ్ అవుతుంది.

కోళ్ల అనే మలయాళ సినిమా మనోరమ మ్యాక్స్ లో జులై 28 న రిలీజ్ కాభోతుంది.