ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో తమిళ సినిమాలలో టెక్నీషియన్స్ నటీనటులు మాత్రమే ఉండాలని ఈ చిత్రాలు తమిళనాడులో మాత్రమే చిత్రీకరణ జరుపుకోవాలని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి అంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తమిళ పరిశ్రమలో ఇతర భాషల వాళ్లకు పనిచేసే అవకాశం కల్పిస్తేనే ఆ ఇండస్ట్రీ ఎదిగే అవకాశం ఉంటుంది కానీ ఇలా నిబంధనలు పెట్టుకుంటే.. బాహుబలి, RRR వంటి గ్లోబల్ సినిమాలు తీయలేమంటు తెలియజేశారు.
తాజాగా పవన్ వ్యాఖ్యల పైన నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఫైర్ కావడం జరిగింది. అసలు ఇలాంటి నిబంధనలు తమిళ ఇండస్ట్రీలోనే లేవంటూ వివరించారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక సమాచారం తప్పుగా ప్రసారం అవుతోంది అంటూ.. తమిళ పరిశ్రమలో ఇతర నటీనటులు పనిచేయకూడదని రూల్ తీసుకువస్తే ముందుగా తానే దానిని ఖండిస్తానంటూ కూడా తెలియజేశారు. సినీ పరిశ్రమ కళాకారులకు అనేక సరిహద్దులు ఏర్పడేలా చేస్తుంది. దీన్ని ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేయడం జరుగుతోంది.
తన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజి పైన తెలియజేశారు ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించారని తెలిపారు.. తమిళ సినీ కార్మికుల కోసం సెల్వమణి గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. తమిళ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నీషియన్లు పెట్టుకోండి అని అన్నారు అంతే కాని ఇతర భాషల వ్యక్తులని వద్దని ఎప్పుడూ చెప్పలేదని కూడా తెలిపారు.. ఇప్పుడు మొత్తం అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే అయ్యాయి ఓటిటి వినియోగం కూడా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఇలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు అంటూ తెలిపారు.