రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో హీరో?

మరో హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నిజానికి రాజకీయాలు, సినిమాలు కలిసే ఉంటాయి. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లోకి రావడం, సినిమాలు చేసే వారు రాజకీయాల్లోకి వెళ్లడం కొత్తేమి కాదు. ఎప్పటి నుంచో ఇది కొనసాగుతున్నదే. ఇండస్ట్రీలో చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లారు. సీనియర్ ఎన్టిఆర్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సంచనాలు సృష్టించారు. ఆ తరువాత నందమూరి కుటుంబంలో బాలకృష్ణ సినిమాలతో పాటు రాజకీయాల్లో అదరగొడుతున్నారు. మెగా ఫ్యామిలీలో కూడా ముందు మెగా స్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మళ్ళీ సినిమాల్లో కొనసాగుతున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు కూడా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త వైరల్ అవుతుంది. ఆ హీరో ఎవరో కాదు. యంగ్ హీరో నితిన్. నితిన్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమానో కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రతి స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పనిదే ఆయన స్టేజి కూడా దిగరు. గత ఏడాది బీజెపీ నేత జేపీ నడ్డా హీరో నితిన్ న్ కలిసిన విషయం తెలిసిందే. బీజేపీకి నితిన్ సపోర్ట్ చేస్తారని, బీజేపీ తరపున ప్రచారం చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ పుకార్లని నితిన్ మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించారని కూడా మాట్లాడుకున్నారు. అయితే దీనికి కారణం వేరే ఉందంట. నితిన్ కాంగ్రెస్ ను సపోర్ట్ చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నితిన్ మేనమామ నగేష్ రెడ్డిని సపోర్ట్ చేయడం ద్వారా రాజకీయాల్లో ఉంటారని తెలుస్తోంది. నగేష్ చాలా ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉంటున్నారు. ఈ మధ్యనే ఆయన రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారుట. నితిన్ వాళ్ళ సొంత ఊరు నిజామాబాద్ రూరల్ నుంచి నగేష్ ను పోటీ చేయించాలని నితిన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సర్వేలను బట్టి టికెట్ ఇస్తానని రేవంత్ రెడ్డి నగేష్ కు చెప్పారని…అందుకే నితిన్ టికెట్ కోసం కష్టపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మాత్రం ఎవ్వరు ఇప్పటివరకు అధికారికంగా మాట్లాడలేదు. నితిన్ రాజకీయాల్లోకి వస్తాడా..లేదా మేనమామకి సపోర్ట్ చేస్తాడా చూడాలి మరి.