ఆ టాలీవుడ్ హీరోతో రెండేళ్లు డేటింగ్ చేసిన ర‌కుల్‌.. పెళ్లికి అడ్డు ప‌డిందెవ‌రు?

టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ సంపాదించుకుని, ఇక్క‌డి టాప్ స్టార్స్ అంద‌రితోనూ ఆడిపోయిన అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఇప్పుడు బాలీవుడ్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. అలాగే మ‌రోవైపు బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతుంది.

షూటింగ్స్ నుంచి ఫ్రీ టైమ్ దొరికిందంటే చాలు ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంది. అయితే ర‌కుల్ జాకీ భగ్నానీ కంటే ముందే టాలీవుడ్ కు చెందిన కొంద‌రు హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపించింది. ఈ జాబితాలో రానా ద‌గ్గుబాటి ఒక‌డు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లోనే రాకుల్ రానా ప్రేమ‌లో ప‌డింద‌ట‌. దాదాపు రెండేళ్లు ఇద్ద‌రూ డేటింగ్ చేశార‌నే టాక్ ఉంది.

వీరిద్ద‌రూ క‌లిసి పార్టీలు, ప‌బ్‌లు అంటూ కూడా తెగ తిర‌గారు. అప్ప‌ట్లో రానా, ర‌కుల్ పెళ్లి చేసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే వీరిద్ద‌రూ విడిపోయారు. అయితే వీరి పెళ్లికి అడ్డు ప‌డిందెవ‌రో తెలియ‌దు గానీ.. ర‌కుల్, రానా విడిపోయాక కూడా త‌మ స్నేహాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టికీ ఎక్క‌డ ఎదురుప‌డినా.. చ‌క్క‌గా ప‌ల‌క‌రించుకుంటారు. ఇకపోతే రానా 2020లో త‌న బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేశాడు. మిహీకా బజాజ్ తో ఏడ‌డుగుల వేశాడు.