మహేష్ చేసిన తప్పు వల్లే ఆ హీరోలు స్టార్స్ అయ్యారా..!!

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నట వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. Ssmb -29 చిత్రంతో పాన్ వరల్డ్ మూవీని రాజమౌళితో కలసి తెరకెక్కిస్తూ ఉన్నారు. మహేష్ బాబు బాల నటుడుగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చి అత్యుత్తమ నటనతో మెప్పించారు. ఆ తర్వాత రాజకుమారుడు సినిమాలో హీరోగా మారి అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలను చేస్తూ అభిమానులను మెప్పిస్తూనే ఉన్నారు.

Mahesh Babu clarifies 'Bollywood can't afford me' comment - India Today

మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లు ఉన్నాయని చెప్పవచ్చు. డైరెక్టర్ కె విజయభాస్కర్ దక్షకత్వంలో తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావాలి సినిమా స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను మొదట మహేష్ బాబుకి వినిపించారు.. ఈ సినిమాకి సంబంధించి సీడీలు కూడా పంపించారట. కానీ మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో హీరోగా తరుణ్ నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. రవితేజ, పూరి కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ సినిమా ని ముందుగా నలుగురు హీరోలు రిజెక్ట్ చేశారు అందులో మహేష్ బాబు కూడా ఉన్నారట.

Even Tarun following Uday Kiran's foot way??? | Movie Gossips

ఉదయ్ కిరణ్ హీరోగా విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమా కూడా మొదట నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ కథను మహేష్ బాబుకి వినిపించారట కానీ ఈ సినిమా సెట్ కాదని రిజెక్ట్ చేయడంతో ఉదయ్ కిరణ్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోయింది. మెగా హీరో వరుణ్ తేజ్, శేఖర్ కమల కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా కథను కూడా మొదట మహేష్కే చెప్పారట.కానీ ఇందులో కమర్షియల్ హంగులు లేకపోవడంతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. అలాగే పుష్ప, వర్షం, ఏం మాయ చేసావే , నాని గ్యాంగ్ లీడర్ తదితర చిత్రాలు కూడా మహేష్ రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.