బిగ్ బాస్ షో పై షాకింగ్ కామెంట్లు చేసిన కంటెస్టెంట్ సరయు..!!

ఏ భాషలో నైన రియాలిటీ షో బిగ్ బాస్ షో కు మంచి పాపులారిటీ ఉన్నది.తెలుగులో ఇప్పటికీ ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా ఏడవ సీజన్ కు కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే నాగార్జున ప్రోమో తెగ వైరల్ గా మారుతోంది. ఈ సీజన్ లో స్టార్ కంటిస్టేన్లను దింపబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి కొంతమంది అభిమానులు ఇది రియల్ అంటే మరి కొంతమంది ఫేక్ అంటూ కూడా తీసిపారేస్తున్నారు.

Bigg Boss Telugu Sarayu Wiki, Biography, Age, Profession, Caste, Date of  birth, Phone and more - BBTV

ఈ విషయంపై తాజాగా పాత బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. సరయు గతంలో బిగ్ బాస్ షోలో బూతు డైలాగులు వల్గర్ పంచులు వంటివి చేస్తూ ఉండేది. పలు రకాల వెబ్ సిరీస్ లలో యూట్యూబ్ లలో కూడా వీడియో చేస్తూ ఉండేది.. బిగ్ బాస్ నాలుగో సీజన్లో సరయు ఎంట్రీ ఇచ్చింది.. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మొదటి వారం రోజులకే హౌస్ నుండి బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటిటిలో మరొకసారి ఎంట్రీ ఇచ్చిన అక్కడ నాలుగు వారాల కంటే ఎక్కువగా ఉండలేకపోయింది.

బిగ్బాస్ గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ మాత్రమే కాదు అన్ని రియాల్టీ షోల్డర్ అన్నీ కూడా ఫేక్ అంటూ తెలియజేసింది. ఈ రియాల్టీ షోలు అన్ని కూడా ఫేక్ వాళ్ళే డబ్బులు ఇచ్చి లేదా వాళ్లని కావాల్సిన వాళ్ళని ప్రమోట్ చేసి గెలిపిస్తూ ఉంటారు.. దీన్ని రియాల్టీ షో గా ప్రేక్షకులను చూపించి పిచ్చోళ్ళని చేస్తున్నారు
.దయచేసి ఇలాంటి రియాల్టీ షోలు చూడకండి అంటూ మీ టైం వేస్ట్ చేసుకోకండి అంటూ తెలియజేస్తోంది.. ఇలా చెప్పడానికి కారణం నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాను కాబట్టి ఈ మాటలు చెబుతున్నాను అంటూ తెలిపింది.