ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. `భోళా శంక‌ర్‌` నుంచి లీకైన క్రేజీ వీడియో!

మెగాస్టార్ చిరంజీవి త్వ‌ర‌లోనే `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సోద‌రి పాత్ర‌లో అల‌రించ‌బోతోంది. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది.

సుశాంత్‌, మురళీ శర్మ, రఘు బాబు త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం స‌మకూర్చారు. ఆగ‌స్టు 11న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. అయితే చిరు లీక్స్ పేరిట గ‌త కొద్ది రోజుల నుంచి త‌న సినిమాల‌కు సంబంధించిన ప‌లు వీడియోను మెగాస్టార్ స్వ‌యంగా లీక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా భోళా శంక‌ర్ నుంచి ఓ క్రేజీ వీడియోను లీక్ చేశారు.

ఈ వీడియోలో చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను ఇమిటేట్‌ చేశారు. పవన్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఖుషి లోని `యే మేరా జహా` పాటను అచ్చం పవన్‌ లాగే ఇమిటేట్‌ చేశారు చిరంజీవి. ఇది శాంపిల్ మాత్రమే అని, సినిమాలో ఇంకా ఉంది అంటూ ఈ వీడియోకి చిరంజీవి క్యాప్ష‌న్ ఇచ్చారు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి భోళా శంక‌ర్ లో చిరంజీవి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు విరాభిమానిగా క‌నిపిస్తాడంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ ప్ర‌చారం తాజాగా లీవైన వీడియోతో నిజ‌మైంది. అన్న‌ట్లు చిరంజీవి లీక్ చేసిన వీడియోలో యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ కూడా ఉండ‌టం విశేషం.