సడన్‌గా సినిమాలు మానేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కారణం తెలిస్తే..

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశంలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ దీపికా పదుకొణె మాత్రమే. ఈ అమ్మడు హిందీతో పాటుగా తెలుగు, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగులో డార్లింగ్ ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ k’ అనే సినిమా లో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం దీపికా హైదరాబాద్ లోనే ఉంది.

దీపికా హైదరాబాద్ లోనే ఉన్న విషయం తెలిసిన ఒక తెలుగు డైరెక్టర్, బడా నిర్మాత వారు తీసే ఒక భారీ ప్రాజెక్ట్ కోసం దీపికను కలిశారట. కానీ దీపికా మాత్రం కనీసం వారు చెప్పే కథ వినడానికి కూడా ఇష్టపడలేదని సమాచారం. అంతేకాకుండా ఇక నుంచి తాను తెలుగు సినిమాలలో నటించనని వారికి తేల్చి చెప్పేసిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్ k సినిమా ఫలితాని బట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే చేయాలా వద్దా అని, అంతేకాకుండా తెలుగు సినిమాకి తను తీసుకునే పారితోషికం మరీ ఎక్కువ అవుతుందేమో అని దీపికా భావిస్తుందట.

అయితే తెలుగు ఇండస్ట్రీ నిర్మాతలు దీపికా ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దీపికా మాత్రం వరుస తెలుగు సినిమాలో నటించి బాలీవుడ్ లో తన రేంజ్ ని, క్రేజ్ ని తగ్గించుకోడం ఇష్టం లేదని స్నేహితులతో చెప్పిందట. దాంతో తెలుగు సినిమా లో నటిస్తే ఆమె స్థాయి ఎలా తగుతుంది అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందేమో దీపికా తెలుగులో మరికొన్ని సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నారు. మరి దీపికా రెండో సినిమా తెలుగులో రావాలంటే ఆమె నటించిన మొదటి సినిమా ప్రాజెక్ట్ k రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది.