హీరోయిన్ల‌తో ఆ ప‌ని చేస్తే త‌ప్పేంటి.. ఆనంద్ దేవ‌ర‌కొండ బోల్డ్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ గ‌త కొద్ది రోజుల నుంచి `బేబీ` ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో యూట్యూబ్ స్టార్ వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్ గా న‌టిస్తే.. విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌ను పోషించాడు. ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్ష‌కుల ముందు రాబోతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌మోష‌న్స్ తో మ‌రింత హైప్ పెంచుతున్నారు. అయితే రీసెంట్ గా చిత్ర టీమ్ బేబీ మూవీ నుంచి ఓ లిప్ కిస్ పోస్టర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. హీరోయిన్ పెదాలపై షుగర్. నోట్లో బ్లేడ్ ఉంటుంది. పక్కనే హీరో లిప్ కిస్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఈ పోస్ట‌ర్ గురించి తాజాగా ఓ ప్రెస్‌మీట్ లో ప్ర‌స్తావ‌న ఇచ్చింది. ఈ పోస్ట‌ర్ అర్థం ఏంటి..? ఇందులో లిప్ కిస్ లు ఉన్నాయా..? అంటూ ఓ రిపోర్ట‌ర్ ఆనంద్ దేవ‌ర‌కొండ‌ను ప్ర‌య‌త్నించాడు.

అంద‌కు ఆనంద్ చాలా బోల్డ్ గా రిప్లై ఇచ్చాడు. లిప్‌ కిస్సులు ఉన్నాయా? లేవా? అనేది సినిమా చూడండి. అయినా హీరోయిన్ల‌తో లిప్ లాక్ చేస్తే త‌ప్పేంటి. అదేదో వల్గర్ అన్న‌ట్లు ఎందుకు భావిస్తారు. సినిమాలో కొన్ని ఎమోషన్స్ పడటం కోసమే అలాంటి సీన్లు పెడుతారు. అంతేకాద‌నీ కావాల‌ని ఎవ‌రు పెట్టరు అంటూ ఆనంద్ దేవ‌ర‌కొండ పేర్కొన్నారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను బేబీ సినిమాలో బాగా చూపించాం. వాటికి ప్రేక్ష‌కులు కూడా కనెక్ట్ అవుతారంటూ ఆనంద్ తెలిపాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.