ఖాకీ డ్రెస్ వేసుకున్న హీరోయిన్లు వీళ్లే.. ఎంతమంది ఉన్నారంటే..?

వెండితెరపై పోలీస్ పాత్రతో హీరోలు, హీరోయిన్లు ఆకట్టుకుంటూ ఉంటారు. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రల్లో తమ డైలాగ్ లు, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను మైమరిపిస్తారు. ఖాళీ డ్రెస్ వేసుకుని సినిమాల్లో నటించాలని చాలామంది నటీనటులకు ఉంటుంది. ఇలా పోలీస్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోలు, హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు హీరోలు మాత్రమే పోలీస్ పాత్రల్లో కనిపించేవారు. కానీ ఇటీవల హీరోయిన్లు కూడా ఖాళీ డ్రెస్ వేసుకుని పోలీస్ పాత్రల్లో అదరగొడుతున్నారు.

విజయశాంతి, సుహాసిని, శారద, టబు, నయనతార, కాజల్ దగ్గర నుంచి ఇప్పటితరం హీరోయిన్ల వరకు చాలామంది పోలీస్ పాత్రల్లో నటించారు. కాజల్ సత్యభామ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి ప్రేక్షకులకు తనలోని కొత్త నటనను పరిచయం చేస్తోంది. అఖిల్ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీచర్ ఇటీవల విడుదలైంది. ఇక అట్లీ డైరెక్షన్‌ లో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో నయనతార పోలీసు పాత్రలో నటిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది.

ఇక గత ఏడాది విడుదలైన శాకిని డాకిని సినిమాలో యంగ్ హీరోయిన్లు రెజీనా, నివేదా థామస్ పోలీస్ పాత్రల్లో నటించారు. అలాగే ఇటీవల వచ్చిన ఝాన్సీ సినిమాలో జ్యోతిక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇక సుప్రీమ్ సినిమాలో హీరోయిన్ రాశీఖన్నా సబ్ఇన్ స్పెక్టర్ గా నటించింది. ఇక అడవి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన క్షణం సినిమాలో యాంకర్ అనసూయ పోలీస్ పాత్రలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి పేరు తెచ్చుకుంది.ఇ అనుష్క, శృతిహాసన్, తమన్నా, నమిత, ప్రియాంక చోప్రా, కీర్తి సురేశ్, అమలాపాల్, పాయల్ రాజ్ పుత్ వంటి హీరోయిన్లు కూడా పోలీస్ పాత్రల్లో నటించారు.