మహేష్ బాబు వేసుకున్న ఈ టీ-షర్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ ఆయన వేసుకునే బట్టల దగ్గర నుండి వాడే వస్తువుల వరకూ చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాటి ధరలు తెలిస్తే నోరేళ్లబెట్టాల్సిందే. మహేష్ బాబు ఒక్కో సినిమాకి రూ.100 కోట్లవరకు పారితోషికం తీసుకుంటారు. దానితోపాటుగా యాడ్స్ ద్వారా మరింత సొమ్ము వెనకేసుకుంటున్నారు.

అయితే సంపాదించడంలోనే కాకుండా కష్టంలో ఉన్నవారికి సాయం చెయ్యడంలో కూడా ముందు ఉంటారు మహేష్. ఇక ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే చాలా లగ్జరీగా ఉంటుందని చెప్పాలి. ఆయన తిరిగే కారు దగ్గర నుండి వేసుకొనే బట్టలు, చెప్పుల వరకు అన్నీ చాలా ఏదో ఉంటాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కాస్ట్లీ లైఫ్ స్టైల్ ని మరోసారి తెలియజేసారు. తాజాగా మహేష్ వేసుకున్న అవుట్ ఫిట్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ది బెస్ట్ ఇన్ మైండ్ స్పేస్ లో జరిగిన “హీల్ ఏ చైల్డ్ కాపీ టేబుల్ బుక్” లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా మహేష్ బాబు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి బ్రూనెల్లో క్యాసినెల్లి ఎంబ్రోయిడరి స్లోగన్ హుడిలో మహేష్ చాలా స్మార్ట్ గా కనిపించారు. ఆ డ్రెస్ లో మహేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనపడారు. ఆయన వేసుకున్న ఆ స్టైలిష్ హుడి ధర ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే మహేష్ వేసుకున్న హుడి ఖరీదు అక్షరాలా రూ.90 వేలు అని తెలిసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా లో నటిస్తున్నారు.