బాల‌య్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్‌.. `భ‌గ‌వంత్ కేస‌రి` రిలీజ్ డేట్ వ‌చ్చేసిందోచ్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. బాల‌య్య లేటెస్ట్ ఫిల్మ్ `భ‌గ‌వంత్ కేస‌రి` రిలీజ్ డేట్ లాక్ అయింది. అఖండ, వీర సింహా రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత బాల‌య్య నుంచి రాబోతున్న సినిమా ఇది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. శ్రీ‌లీల‌, బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డేలా చేశాయి. అభిమానులే కాకుండా సినీ ప్రియులు సైతం భ‌గ‌వంత్ కేస‌రి కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేక‌ర్స్ ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. భ‌గ‌వంత్ కేస‌రి ద‌స‌రా పండుక కానుక‌గా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. `భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది` అని పేర్కొంటూ కొత్త పోస్ట‌ర్ వ‌దిలారు. రిలీజ్ డేట్ తో కూడిన ఈ పోస్టర్ లో భారీ గన్స్ ప‌ట్టుకుని ఫుల్ యాక్ష‌న్ మోడ్ లో ఉన్న‌ బాలయ్య లుక్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషి అయ‌పోతున్నారు.