ప్రేమకథాచిత్రం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే..

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుదీర్ బాబు హీరోగా నటించిన ‘ప్రేమ కథ చిత్రం’ లో  హీరోయిన్ గా నటించింది నందిత రాజ్. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో నందిత హీరోయిన్ గా, దయ్యం గా నటించి తన పెద్ద పెద్ద కళ్లతో అందరిని బయపెట్టింది. ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రేమ కథ చిత్రం సినిమాతోనే బాగా పాప్యులర్ అయింది నందిత.

అయితే సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ ఉండే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య మాత్రం కనపడడం లేదు . దాంతో ఆమె గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఆమె అభిమానులు కొంతమంది ‘నందిత ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఏం చేస్తుంది ‘ అంటూ ఆమె గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. మోడలింగ్ రంగం నుండి వచ్చిన ఈ చిన్నది సిని ఇండస్ట్రీ లో సరైన అవకాశాలు రాక హీరోయిన్ గా నిలదోక్కుకోలేకయింది. తేజ దర్శకత్వం వహించిన ‘ నీకు నాకు డాష్ ‘ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

నందిత నటించిన మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆమె నటన కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత వచ్చిన ప్రేమ కథ చిత్రం తో బాగా పాపులర్ అయింది ఈ ముద్దు గుమ్మ. అయితే ఆ తరువాత ఆమె నటించిన సినిమాలేవి హిట్ అవ్వలేదు. గతంలో కొత్త దర్శకుడు రాజా కిరణ్ దర్శకత్వం వహించిన ‘విశ్వమిత్ర ‘ సినిమా లో సత్యం రాజేష్, నందిత జంటగా నటించారు. ఆ సినిమా కూడా హిట్ అవ్వలేదు. సరైన కథ ఎంచుకోకపోవడం తో నందిత నటించిన సినిమా లు అన్ని పరాజయం అయ్యాయి. దాంతో సినిమా ఛాన్సులు తగ్గిపోయి మళ్ళీ మోడలింగ్ వైపు అడుగులు వేసింది.