మహేష్ పోకిరి లేడీ విలన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

ఏ ఇతర ఇండస్ట్రీలో నైనా మంచి పాపులారిటీ సంపాదించాలంటే ..చిన్న క్యారెక్టర్ లేదా ఒక డైలాగ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు.అలా చాలామంది పాపులర్ అయిన వారు ఉన్నారు..ఇలాంటి కోవలోనే వెళ్లిన అమ్మడు ఓవర్ నైట్ లోనే స్టార్డం సంపాదించుకుంది. ఇంతకు ఆ సినిమా ఏంటి ఆ అమ్మడు ఎవరు అని అనుకుంటున్నారా.. మహేష్ నటించిన పోకిరి సినిమాలో విలన్.. ప్రకాష్ రాజ్ పక్కన గిల్లితే గిల్లించుకోవాలి అని చెప్పే డైలాగ్ ఎంతలా ఫేమస్ అయ్యిందో ఆ సీన్ లో నటించిన ఈ అమ్మడు కూడా అంత ఫేమస్ అయ్యింది.ఇంతకు ఆమె ఎవరు అనుకున్నారు బాలీవుడ్ నటి ‘షీవా రానా’

Sheeva Rana Biography, Age, Gandi Baat 3, Weight, Web Series, Career,  Relationship, Family, Caste, Net Worth, Life Style, Instagram, Hot Photos &  Videos

ఈ అమ్మడు పోకిరి సినిమాలో మోనా పాత్రలో నటించింది. ఈ మూవీలో తన కిల్లింగ్ లుక్స్ యాటిట్యూడ్ తో ఫాన్సును బాగానే ఆకట్టుకుంది. ఈ అమ్మడు హీరోయిన్ మాత్రమే కాదు సర్టిఫైడ్ యోగ ట్రైనర్ కూడా ఇటీవలే ఈ అమ్మడు గందీబాత్ 3 అనే వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మేహబూబా చిత్రంలో ఓ కీలకమైన రోల్ ని చేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్లో ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ తన కెరీర్లో ముందుకు కొనసాగుతోంది. సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటూ బాగానే క్రేజ్ పెంచుకుంటోంది. తెలుగులో మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కించిన పోకిరి చిత్రం అందులో ఈమె క్యారెక్టర్ ని ఇప్పటికీ కూడా మర్చిపోలేక పోతున్నారు అభిమానులు. అంతేకాకుండా మహేష్ బాబు కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ గా నిలిచింది ఈ చిత్రం