ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ఓటీటి లోకి వచ్చేది అప్పుడే..?

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ యూట్యూబర్ వైష్ణవి చైతన్య నటించిన చిత్రం బేబీ.. ఈ సినిమా నిన్నటి రోజున విడుదలై మంచి విజయాన్ని అందుకుంది అయితే ఇందులో మరొక హీరో విరాజ్ అశ్విన్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీని చూశామంటూ ఆడియన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే యూట్యూబ్లో కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి.

Baby Movie Review: A Morally Ambiguous Drama That Thrives In The Flaws Of  Its Characters

యూత్ కు బాగా నచ్చడంతో బేబీ సినిమా చూసిన సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్ల పరంగా భారీగా వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు ఇక బేబీ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటి ప్లాట్ఫామ్ aha సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆగస్టు మూడో వారం లేదా నాలుగో వారంలో ఓటీటి లో స్ట్రిమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ ఒక ఆటో డ్రైవర్ గా నటించారు.

Baby movie review: Anand Deverakonda film is impressive, divisive | Telugu  News, The Indian Express

వైష్ణవి విరాజ్ అశ్విన్ బీటెక్ స్టూడెంట్ గా కనిపించడం జరిగింది అలాగే నాగబాబు వైవా హర్ష తదితరులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటించారు లవ్ స్టోరీ కి విజయ్ బుల్కానిక్ అందించిన పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ఎట్టకేలకు ఆనంద్ దేవరకొండ కెరియర్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా పడిందని చెప్పవచ్చు మరి కలెక్షన్ల పరంగా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.