తమన్నా తో డేటింగ్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ వర్మ..!!

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గత కొద్దిరోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిందని.. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇతడితో ప్రేమలో పడినప్పటి నుంచి తమన్నా హద్దులు మీది మరి ప్రవర్తిస్తోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా విజయవర్మ, తమన్నా తో రిలేషన్స్ పై ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

Fans spot Tamannaah kissing Vijay Varma. 5 times actress made headlines for  rumoured linkups - India Today

తాజాగా బాలీవుడ్ లో జిక్యు అనే ఒక పత్రిక ఇంటర్వ్యూలో.. విజయ్ వర్మ మాట్లాడుతూ తమన్నా ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నానని తెలియజేసినట్లు తెలుస్తోంది.. దీంతో మా మధ్య ఎలాంటి లవ్వు లేవని తమన్నా చెప్పిన ఇవన్నీ కబుర్లు గానే మిగిలిపోయాయి. అయితే విజయ వర్మ ఇప్పటికే ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. తమన్నా పేరు కూడా పచ్చబొట్టు కొలిపించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే గోవా తో పాటు పలు రకాల ఫారం టూరిస్టుల స్పాట్ కు కూడా ఈ జంట వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే తమన్నా వివాహం చేసుకోబోతోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

తమన్నా ,విజయ్ వర్మ కలిసి లవ్ స్టోరీస్-2 అని వెబ్ సిరీస్ లో నటించడంతో మరింత దగ్గరయ్యారని దీంతో మేమిద్దరం డేటింగ్ చేస్తున్నామని మాకు ఇప్పుడే తెలిసింది అంటూ విజయ వర్మ తెలియజేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఆమె రాకతో తన జీవితంలో విలన్ ఆధ్యాయణం ముగిసి ప్రేమకాండ మొదలైంది అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు తెలుస్తోంది విజయవర్మ.. మారు వారి కుటుంబంలో జన్మించిన విజయవర్మ ప్రస్తుతం 37 సంవత్సరాలు. విజయ వర్మ ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడడమే కాకుండా పలు హిందీ చిత్రాలతో పాటు నాని నటించిన MCA చిత్రంలో కూడా విలన్ గా నటించారు. ప్రస్తుతం తమన్న బోల్డ్ వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా మారిపోయింది మరి త్వరలోనే వివాహ విషయాన్ని తెలియజేస్తారేమో చూడాలి మరి.