టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తన భర్తకు ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటారు. శ్రీజ రెండో వివాహం చేసుకొని మరొక బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తనతో కూడా విభేదాలు రావడంతో శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం విడివిడిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే వీరిద్దరూ విడాకుల వ్యవహారాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
సోషల్ మీడియాలో మాత్రం కళ్యాణ్ దేవ్ పలు రకాల పోస్టులను షేర్ చేస్తూనే ఉంటారు. వీరు షేర్ చేసేటువంటి పోస్టులను చూస్తే వీరిద్దరూ విడిపోయారని విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.కోర్టు పర్మిషన్తో వారంలో కేవలం నాలుగు గంటలు మాత్రమే తన కూతురుతో గడిపే అవకాశం కళ్యాణ్ దేవ్ ఉన్నది. దీంతో ఈయన వారంలో ఈ నాలుగు గంటలు తనకు ఆనందమైన క్షణాలు అంటూ తన కుమార్తెను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఎన్నో రకాల పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు కళ్యాణ్ దేవ్..
తాజాగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నామంటే మోసం ఎప్పటికీ ఎవరిని ఆశ్చర్యపరచలేదు.. కానీ నమ్మకం మాత్రమే ఆ పని చేయగలదు అంటూ ఒక కొటేషన్ ని షేర్ చేయడం జరిగింది.. మరి ఈయన నమ్మకం మోసం అంటూ ఎవరిని టార్గెట్ చేసి ఈ పోస్ట్ షేర్ చేశారు తెలియదు కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ మాత్రం శ్రీజను ఉద్దేశించే కళ్యాణ్దేవ్ చేశారంటూ పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.