మెగా ఫ్యామిలీతో విభేదాలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!!

డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ ఈ సినిమా ఎన్ కే ఎన్ నిర్మించారు. ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది యువత కు ఎక్కువగా ఈ సినిమా కనెక్ట్ అయ్యింది.అయితే ఈ లవ్ స్టోరీ రోజు రోజుకి కలెక్షన్ల పరంగా బాగానే దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ని పిలిపించుకొని దాదాపుగా రెండు గంటలపాటు మాట్లాడి ఈ సినిమా గురించి ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకున్నారట.

The Mega Family: When Allu Arjun, Ram Charan, Chiranjeevi, Pawan Kalyan  united for a picture-perfect photo | PINKVILLA

అయితే ఈ సినిమాని ప్రశంసించేందుకు అల్లు అర్జున్ ఒక స్పెషల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సినిమా టీం అందరిని ఎంకరేజ్ చేస్తూ అల్లు అర్జున్ అదిరిపోయే స్పీచ్ ఇవ్వడం జరిగింది. బేబీ సినిమా తనకు చాలా నచ్చిందని ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా తగ్గకుండా ఉందని తెలియజేశారు.అమీర్పేటలో ఆటో నడిపే వ్యక్తిగా ఈ హీరోని చూశాను నాకు తెలియకుండానే స్క్రీన్ దగ్గరకు వెళుతున్న మళ్ళీ వెనక్కి వస్తున్న బేబీ సినిమా తనకు బాగా నచ్చింది అంటూ అల్లు అర్జున్ తెలిపారు.

రెండు మూడేళ్లు కష్టపడి సాయి రాజేష్ ఇంత మంచి సినిమాను తీశారు సుకుమార్ మారుతి వీళ్ళ మీటర్లు సాయి రాజేష్ బేబీ సినిమా చేశారని తెలిపారు. ఈ సినిమాలో నిర్మాత ఎన్ కే ఎన్ని అల్లు శిరీష్ ఏలూరు నుంచి పిలిపించారని మెగా అభిమానిగా అతను చేస్తున్న ప్రమోషన్స్ చూసి చాలా ముచ్చటేస్తోంది.. హైదరాబాదుకు రమ్మనగానే వచ్చి ఒక రూమ్ లో తన ఉన్నాడని అప్పటినుంచి జర్నలిస్టుగా పిఆర్ గా ఒక మెట్టు వెతుకుతూ పైకి వచ్చారని అల్లు అర్జున్ ఎంకేఎన్ మెగా అభిమాని అని తను కూడా కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానులమే అంటూ తెలియజేశారు. దీంతో మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలియజేశారు.