నమ్మి మోసపోయిన హీరోయిన్ కి..కొత్త లైఫ్ ఇస్తున్న విజయ్ దేవరకొండ.. సార్ కి ఎంత పెద్ద మనసో..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ – పెద్దమనసు చాటుకుంటున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు ..సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా లైగర్ . భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణాతి దారుణంగా పరాజయం పాలయింది . పెట్టిన దానికి అర్ధ రూపాయి కూడా రాకుండా దారుణమైన నెగటివ్ ట్రోలింగ్స్ కి గురైంది.

అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తరువాత విజయ్-పూరి దర్శకత్వంలో రావాల్సిన జనగణమన సినిమా క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఎన్నో భారీ ప్రాజెక్టులను వదులుకున్న పూజా హెగ్డే బ్రతుకు బస్టాండ్ అయిపోయింది . మనకు తెలిసిందే విజయ్ – పూరి దర్శకత్వంలో “జనగణమన” సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డేను అనుకున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయిపోవడంతో పూరీ జగన్నాథ్ – విజయ్ ఎంత నష్టపోయాడో తెలియదు కానీ .. పూజా మాత్రం సర్వం కోల్పోయింది .

ఈ క్రమంలోనే ఆమె నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజాని మెల్లమెల్లగా మర్చిపోతున్న జనాలకు మళ్ళీ ఆమె పేరును గుర్తు చేసేలా చేశాడు విజయ్ దేవరకొండ . విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గీతాగోవిందం సినిమా డైరెక్టర్ పరశురామ్ తో విజయ్ దేవరకొండ మరో సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే కు ఛాన్స్ ఇచ్చాడట విజయ్ . ఈ క్రమంలోనే ఒక సినిమాతో ముంచేసిన విజయ్ .. మరో సినిమాతో లైఫ్ ఇవ్వబోతున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది విజయ్ లోని మంచితనం అంటుంటే మరి కొందరు విజయ్ ని తక్కువగా చేసి చూస్తున్నారు.. ఏది ఏమైనా సరే విజయ్ – పూజ కాంబో ని తెరపై చూడాలనుకున్న జనాలకు .. ఇది మంచి కిక్ ఎక్కిస్తుంది..!!