డెలివరికి కొద్ది రోజుల ముందే అత్త-మామకు ఉపాసన స్పెషల్ సర్ప్రైజ్..ఎందుకో తెలిస్తే శభాష్ అనాల్సిందే..!!

మనకు తెలిసిందే మెగాకోడలు ఉపాసన గర్భవతి . మరికొద్ది రోజుల్లోనే పాపకి లేదా బాబుకి జన్మనివ్వబోతుంది . అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది అని తెలియడంతో మెగా కుటుంబంతో పాటు మెగా ఫాన్స్ కూడా అంతే ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చేతిలో పాప లేదా బాబు ఉంటే చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఉపాసన సైతం తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన జర్నీని అభిమానులతో షేర్ చేసుకుంది.

మొదటగా చరణ్ కి ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే ..ఎంత ఎగ్జైట్ అవుతాడు అని అనుకున్న ఉపాసన ..చరణ్ చాలా కూల్ గా రియాక్ట్ అయ్యాడు అంటూ చెప్పుకొచ్చింది . అంతే కాదు రీసెంట్గా ఉపాసన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే పెళ్లి తర్వాత ఉపాసన – రాంచరణ్ ఓ విలాసవంతమైన బంగ్లా కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అయ్యారు . అయితే ఇప్పుడు అక్కడి నుంచి మళ్లీ చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవ్వడానికి రెడీ అయ్యారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది ఉపాసన .

దానికి మెయిన్ రీజన్ “నేను చరణ్ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి మెయిన్ కారణం మా గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ.. వాళ్ల పెంపకంలో పెరిగాం కాబట్టే మా పద్ధతులు ఇంత చక్కగా ఉన్నాయి. నా బిడ్డకు కూడా అదే దక్కాలి నా బిడ్డ కూడా గ్రాండ్ పేరెంట్స్ సమక్షంలోనే పెరగాలి ..అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మా మావయ్య అత్తయ్య కూడా చాలా సంతోషంగా ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో మెగా కోడలు పిల్ల తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్తమామలను దూరంగా పెట్టే కోడలు ఉన్న ఈ రోజుల్లో ఉపాసన లాంటి కోడలు కూడా ఉండడం గర్వించతగ్గ విషయం అంటూ ట్రెండ్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఉపాసన తీసుకున్న నిర్ణయం పట్ల మెగా ఫాన్స్ తో పాటు మిగతా జనాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు..!!