బింబిసార-2 నుంచి ఒకేసారి మూడు అప్డేట్స్..!!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లో వరుస ప్లాపులు అవుతున్న సమయంలో మంచి సక్సెస్ అందుకున్న చిత్రం బింబిసారా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బాగానే లాభాలను పొందినట్లుగా తెలుస్తోంది.బింబిసారా సక్సెస్ అయిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ ఉంటుందని కూడా ప్రకటించడం జరిగింది చిత్రబృందం. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ వశిష్ట ఇతర కమిట్మెంట్ లతో బిజీగా ఉన్నందువల్ల బింబిసారా-2 చిత్రాన్ని వేరొక డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలియజేశారు.

Two massive changes for Bimbisara 2

తాజాగా ఈ సినిమా సీక్రెట్ గురించి మూడు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మొదట విషయానికి వస్తే ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించకపోవచ్చు కానీ స్క్రిప్ట్ వర్క్ లో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో బింబిసారా-2 ను భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే ఈ సినిమా మొదలుపెట్టబోతున్నారు వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి వరకు ప్రీ ప్రొడక్షన్ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ అనే ఒక పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా బ్రిటిష్ కాలంలోని కథాంశంతో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.