ఆదిపురుష్ నుండీ సెకండ్ ట్రైలర్.. ఈసారి అంతకుమించి..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ సినిమాపై ఇప్పటికె అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమా పైన మంచి హైప్ ను తీసుకు వచ్చాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాముడిగా ప్రభాస్ సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఈనెల 16వ తేదీన ఈ సినిమా అన్ని భాషలలో పాన్ ఇండియా లెవెల్లో ఒకేసారి విడుదల కాబోతోంది.

adipurush premiere: 'Adipurush' to be screened at Tribeca Film Festival,  Prabhas & Kriti Sanon excited for world premiere in New York - The Economic  Times
తాజాగా UV ప్రమోషన్స్ ఈ సినిమా స్పీడ్ ను పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా నుంచి ఇప్పుడు మరొక ట్రైలర్ ని తీసుకురావడానికి చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ట్రైలర్ కొన్ని రోజులు ముందుగానే విడుదల చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ట్రైలర్ కూడా నెవర్ బిఫోర్ విజువల్స్ తో గ్రాండ్ ఇయర్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతొందని టాక్ వినిపిస్తోంది.అయితే ఈ విషయం పైన ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నది.

మరొకవైపు ఆది పురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ను తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు సమాచారం. జూన్ 6వ తేదీన ఈ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సిని ప్రముఖుల సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా సెకండ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.