రామ్‌చరణ్‌కి తల పొగరు.. ఫోన్ చేసినా ఎత్తడు: డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRRతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తన అప్ కమింగ్ సినిమాలతో బిజీ అయ్యాడు. అలానే తన మొదటి బిడ్డ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే, ఈ క్రమంలోనే దర్శకుడు అపూర్వ లఖియా రామ్ చరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జంజీర్ (తెలుగులో తుఫాన్) సినిమాని రామ్‌ చరణ్ తో కలిసి తెరకెక్కించాడు ఈ దర్శకుడు. ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత కూడా చెర్రీ, ఈ దర్శకుడు మధ్య మంచి ఫ్రెండ్షిప్ కొనసాగింది. అయితే ఆర్ఆర్‌ఆర్ సినిమా హిట్ అయిన తర్వాత తన కాల్‌లను చెర్రీ లిఫ్ట్ చేయకుండా తప్పించుకుంటున్నాడని ఈ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అపూర్వ లఖియా “జంజీర్” హిందీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చెర్రీ కి ఏం బాలీవుడ్ లో మంచి ఎంట్రీ కూడా దానితోటి లభించలేదు. కాగా వారి మధ్య బలమైన కనెక్షన్ ఉన్నప్పటికీ, RRR విజయం తర్వాత చరణ్ తన కాల్‌లకు ప్రతిస్పందించడం మానేసినట్లు లఖియా వెల్లడించింది. RRR కోసం ఉక్రెయిన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు, రామ్ చరణ్ తనకు కాల్ చేశాడని అపూర్వ పేర్కొన్నాడు. ఆ సమయంలో తన కెరీర్ గురించి చెర్రీ ఆరా తీసినట్లు వెల్లడించాడు.

అంతేకాదు, అపూర్వ తన షోలో నిమగ్నమై ఉండగా.. చరణ్ కొన్ని సెకండ్-యూనిట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించమని అభ్యర్థించాడు. అపూర్వ తన కొనసాగుతున్న కమిట్‌మెంట్‌ల కారణంగా ఆ సమయంలో ఆ పని చేయడానికి ఒప్పుకోలేకపోయాడు. అయితే, ఆ సంభాషణ నుంచి, చరణ్ అపూర్వ ఏ కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదు. చరణ్‌ బిజీ షెడ్యూల్‌ కారణంగా ఇలా చేస్తూ ఉండొచ్చని అతని అభిప్రాయపడ్డాడు. అయితే బాలీవుడ్ అభిమానులు మాత్రం దొరికిందే సంధుగా భావించి చరణ్ పై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మంచి హిట్ వచ్చిన తర్వాత చరణ్ కి తలపోగురు పెరిగిపోయిందని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం, రామ్ చరణ్ తన అప్‌కమింగ్ ఫిల్మ్ “గేమ్ ఛేంజర్” షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నాడు.