రామ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. హీరోగారు తొంద‌ర ప‌డుతున్నారండోయ్‌!!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం రామ్ స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరి క‌ల‌యిక‌లో వ‌స్తున్న తొలి చిత్ర‌మిది. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన‌ప్పుడు మూవీపై అంచ‌నాలు పిక్స్ లో ఏర్పడ్డాయి. రామ్ కెరీర్ లో ఇది 20వ చిత్రం. ఈ నేప‌థ్యంలోనే `RAPO20` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ మూవీని ప్రారంభించారు.

ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ‌నివాసా సిల్క‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్ పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రీ పోన్ అయింది.

అనుకున్న తేదీ కంటే నెల రోజుల ముందే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అవును, అక్టోబర్ 20కి బదులు సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు నేడు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్ లో రామ్ క్లాసీ లుక్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇక‌పోతే చెప్పిన డేట్ కన్నా ముందు సినిమాని రిలీజ్ చెయ్యడం వెనక బాలయ్య కారణం అని తెలుస్తోంది. బాల‌య్య‌, అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కుతున్న `భ‌గ‌వంత్ కేస‌రి` అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు. బాల‌య్య‌తో బోయ‌పాటి మంచి స‌న్నిహిత్యం ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పోటీ ప‌డ‌టం ఇష్టం లేక విడుద‌ల విష‌యంలో తొంద‌ర‌ప‌డుతున్నార‌ని టాక్‌.