పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సినిమా రీ రిలీజ్..!!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రం ఏ రేంజ్ లో ఆడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పవన్ కళ్యాణ్ నటన కూడా అద్భుతంగా ఉంది. ఇక ఆయన ఈ సినిమాలో చాలా అమాయకంగా పని పాట లేని కుర్రాడిలా కనిపించాడు. ఈ సినిమాలో ప్రేమ కోసం తపించిపోతున్న ప్రేమికుడిలా కనిపించాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బాలు పాత్రలో నటించగా ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ సినిమాకు కూడా మంచి పేరు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. ఆ సినిమాలోని పాటలు విషయానికొస్తే ఇప్పటికీ కూడా అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. ఎన్నో సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ పాటలు మాత్రం ఎవరి గ్రీన్ గానే ఉన్నాయి.

22YearsForTholiPrema: Here's why the Pawan Kalyan starrer works even 22  years after its release | Telugu Movie News - Times of India
అయితే తొలిప్రేమ సినిమా విడుదలై ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు రీ రిలీజ్ కావాలనుకుంటున్నారు. దింతో తొలిప్రేమ సినిమాbరి రిలీజ్ కి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పట్లో తొలిప్రేమ చిత్రం 1998లో విడుదలయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి 25 ఏళ్లు కావడంతో ఈనెల 30న భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నారు.

తొలి ప్రేమ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 10:30 కి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి ఏ కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా కీర్తి రెడ్డి నటించింది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో.. ఆలీ,వాసుకి ,వేణుమాధవ్ నటిస్తున్నారు. ఈ విషయం విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, బ్రో, హరిహర వీరమల్లు వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.