విజ‌య్ కు ఎప్పుడూ అదే ధ్యాస‌.. నిద్ర మానేసి మ‌రీ చేస్తాడు.. త‌మ‌న్నా బోల్డ్ కామెంట్స్‌!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ `ల‌స్ట్ స్టోరీస్ 2`లో జంట‌గా న‌టించారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స‌మ‌యంలో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మార‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు. ఈ ఏడాది న్యూ ఇయ‌ర్ వేడుకుల‌ను వీరిద్ద‌రూ గోవాలో జ‌రుపుకున్నారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి ల‌వ్ ఎఫైర్ వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి.

ఫైల‌న్ గా త‌మ‌న్నా విజ‌య్ తో రిలేష‌న్ లో ఉన్న‌ట్లు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. అయితే తాజాగా ల‌స్ట్ స్టోరీస్ 2 ప్ర‌మోష‌న్స్ లో భాగంగా త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు అనేక విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే విజ‌య్ వ‌ర్మ‌లో త‌న‌కు న‌చ్చ‌ని ఓ విష‌యాన్ని త‌మ‌న్నా బ‌య‌ట‌పెడుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. విజయ్ లోని అన్ని విషయాలు త‌న‌కు న‌చ్చుతాయ‌ని, కానీ, ఒక‌టి మాత్రం అస్స‌లు న‌చ్చ‌ద‌ని, అదే జిమ్ చేయడమ‌ని త‌మ‌న్నా చెప్పుకొచ్చింది.

విజయ్ ధ్యాస మొత్తం జిమ్ వర్కౌట్స్ పైనే ఉంటుంది. రోజూ వర్కౌట్ చేయాలి అని అనుకుంటాడు. నిద్ర మానేసి మ‌రీ జిమ్ చేస్తాడు. అది నాకు అస్స‌లు న‌చ్చ‌దంటూ త‌మ‌న్నా పేర్కొంది. ఇక ఇదే విష‌యంపై విజ‌య్ వ‌ర్మ స్పందిస్తూ.. `జిమ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. జిమ్ చేయ‌డం కోసం దేనినైనా వదులుకోవాల‌నిపిస్తుంది. తమన్నాను బాధ పెట్టాలని కాదు, కానీ, జిమ్ నాకు బాగా అల‌వాటు అయిపోయింది` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో వీరిద్ద‌రి కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.