ఆదిపురుష్‌ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు.. ఆ విషయంలో కీలక నిర్ణయం..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మొదటిసారి రాముడు పాత్రలో నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవల రూ.1,000 కోట్ల టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా తక్కువ కలెక్షన్లు రాబట్టి నిరాశపరిచింది. అంతేకాకుండా చాలా వివాదాల్లో చిక్కుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. దాంతో ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా గురించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా చూసిన వాళ్లకంటే చూడాల్సిన వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే వాళ్లలో చాలామంది సినిమాకి ఆల్రెడీ ఫెయిల్యూర్ టాక్ వస్తుంది కాబట్టి థియేటర్లోకి వెళ్లి చూడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. ఎలాగో ఫెయిల్యూర్ టాక్ వస్తుంది కాబట్టి త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది కదా అప్పుడు చూడొచ్చులే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాని థియేటర్లలో చూసిన వారి కంటే చూడని వారు మూడు రెట్లు అధికంగా ఉన్నారని, వారంతా ఓటీటీలో ఈ సినిమాను చూసే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. కానీ మేకర్స్ విడుదలకు ముందు ‘సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని’ ప్రకటించారు. కాబట్టి 50 రోజుల వరకు ఆదిపురుష్ సినిమాని ఓటీటీ లో చూడాలనుకుంటున్న వారంతా వెయిట్ చెయ్యక తప్పదు.

మరి సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. వారికోసమైన మేకర్స్ మనసు మార్చుకొని ఆదిపురుష్ సినిమా ని కాస్త ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ముందుగా అమ్ముకుంటే ఎక్కువ మనీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఆదిపురుష్ సినిమానే ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసిందనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.