కూతురు ఎవ‌రి పోలికో చెప్పేసిన రామ్ చ‌ర‌ణ్‌.. బిడ్డ‌తో ఇంటికి బ‌య‌లుదేరిన ఉపాస‌న దంప‌తులు!

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంపతులు పెళ్లి జ‌రిగిన 11 ఏళ్ల‌కు పేరెంట్స్ గా ప్ర‌మోట్ అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. జూన్ 20వ తేదీ తెల్ల‌వారుజామున ఉపాస‌న అపోలో హాస్ప‌ట‌ల్ లో పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు.

అలాగే రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌కు స్నేహితులు, స‌న్నిహితులు, సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు విషెస్ తెలిపారు. ఇక నేడు ఉపాస‌న హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయింది. బిడ్డ‌తో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న కొద్ది సేప‌టి క్రిత‌మే ఇంటికి బ‌య‌లుదేరారు. చిన్న‌రి ముఖం మాత్రం బ‌య‌టకు క‌నిపించ‌కుండా చాలా జాగ్ర‌త్త తీసుకున్నారు. అలాగే ఇంటికి వెళ్ల‌బోయే ముందు రామ్ చ‌ర‌ణ్ అక్క‌డి మీడియాతో మాట్లాడాడు.

ఉపాస‌న‌, పాప ఇద్ద‌రూ హెల్తీ ఉన్నార‌ని.. త‌మ‌కు విషెస్ తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరుగా ధ‌న్య‌వాదాల‌ని రామ్ చ‌ర‌ణ్ పేర్కొన్నాడు. అలాగే ఉసాస‌న మ‌రియు బేబీని ట్రీట్ చేసిన డాక్ట‌ర్స్ అంద‌రికీ చ‌ర‌ణ్ థ్యాంక్యూ చెప్పాడు. బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కూతురు పేరు గురించి ప్ర‌స్తావ‌న రాగా.. తాను, ఉపాస‌న ఒక నేమ్ ను డిసైడ్ అయ్యామ‌ని, కానీ, 21వ రోజు అనౌన్స్ చేస్తామ‌ని చ‌ర‌ణ్ తెలిపారు. ఇక కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా.. `అన్నీ నాన్న పోలికలే` అని చెబుతూ రామ్ చ‌ర‌ణ్ చిరు న‌వ్వులు చిందించాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.