శ్రీలీల అందానికి స్టార్ డైరెక్టర్ ఫిదా.. జాక్ పాట్ ఆఫర్ కొట్టిన యంగ్ బ్యూటి..!?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక బ్యూటీ పేరే మారుమ్రోగిపోతుంది . ఆ అమ్మడే శ్రీలీల తన వయసు కంటే డబల్ రేంజ్ లో ఉండే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ హాట్ రొమాన్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ ముద్దగుమ్మ ఏకంగా 10 ప్రాజెక్టులను చేతిలో పట్టుకొని ఉంది . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరితో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది .

ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ఏడు రిలీజ్ అయ్యాయి… అంటే శ్రీ లీల హవా ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు .కాగా ఈ స్పీడ్ నుంచి తట్టుకోక ముందే మరొక క్రేజీ ప్రాజెక్టును సైన్ చేసింది శ్రీలీల అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో మరోసారి హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది శ్రీలీలా అంటూ ప్రచారం జరుగుతుంది .

గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాకి ఫిక్స్ అయ్యాడట. వీళ్ళిద్దరి కాంబో తెరపై ఎలా వర్కౌట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కాంబోలో హాట్ బ్యూటీ శ్రీ లీలా యాడ్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి పూనకాలు పక్కా అని చెప్పాలి . అందుకే గోపీచంద్ మల్లినేని సైతం శ్రీ లీల అందానికి మెచ్చి ఏరి కోరి ఆమెని కాల్ షీట్స్ అడిగిమరీ బుక్ చేసుకున్నాడట . అంతేకాదు ఈ సినిమాలో శ్రీ లీలా మహా మహారాజ రవితేజ మరోసారి ఘాటైన రొమాన్స్ చేయబోతున్నారు అని .. ఇరగదీసే స్టెప్స్ చేయబోతున్నారు అంటూ తెలుస్తుంది . చూడాలి మరి దీనిపై చిత్ర బృందం ఎప్పుడు అఫీషియల్ గా స్పందిస్తుందో..?