బ్లూకలర్ డ్రెస్‌లో మెరిసిపోయిన శ్రీముఖి.. బ్యూటిఫుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు..

ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర రాములమ్మగా ఎన్నో సంవత్సరాలుగా యాంకరింగ్ చేస్తుంది. పలు కార్యక్రమాలలో కనిపిస్తూ భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. గ్లామర్స్ ఫొటోలతో ఎప్పటికప్పుడు అభిమానులను అల్లరిస్తూ ఉంటుంది. శ్రీముఖి ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలు పెట్టినప్పుడు హీరోయిన్‌గా నటించడానికి ప్రయత్నాలు చేసింది. కొన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. జులాయి, నేను శైలజ, జెంటిల్ మ్యాన్ లాంటి చాలా చిత్రాలలో నటించి మెప్పించింది.

అంతేకాకుండా బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 3 లోకి కాంటెస్ట్‌గా వెళ్లి రన్నరప్‌గా బయటకి వచ్చింది. ఇలా 2013లో అదుర్స్ అనే షోలో యాంకర్ గా అడుగుపెట్టిన శ్రీముఖి కేరిర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతుంది. ఏ ఛానెల్‌లో చూసినా, ఏ షోలో చూసినా శ్రీముఖినే దర్శనం ఇస్తుంది. బుల్లితెరపై ఎంటర్‌టైన్ చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బుల్లితెర రాములమ్మ. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఒక షో కోసం ఈ అమ్మడు ధరించిన డ్రెస్ చాలా బాగుంది. లైట్ బ్లూ కలర్ డ్రెస్‌లో శ్రీముఖి అందం మరింతగా పెరిగిపోయింది. బ్లూ కలర్ ఫుల్ గౌన్, లైట్ వర్క్ ఉన్న బ్లూ టాప్ వేసుకొని మెరిసిపోయింది శ్రీముఖి. ఏమాత్రం ఎక్సపోజింగ్ చెయ్యకుండా చాలా బ్యూటిఫుల్ గా కనపడింది ఈ ముద్దుగుమ్మ. అందమైన డ్రెస్ లో చాలా అందంగా ఫొటోలకు ఫోజలు ఇచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసింది శ్రీముఖి. సోషల్ మీడియాలో శ్రీముఖి ఫోటోలు చూసి చాలా క్యూట్‌గా ఉన్నావ్ శ్రీ అంటూ కొంతమంది అంటుంటే, మరికొంతమందేమో ని బ్యూటిఫుల్ అందానికి మేం ఫిదా అయిపోయాం అని మరికొందరు అంటున్నారు. ఇలా శ్రీముఖి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.