పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చిన ఉపాసన.. అదృష్టం కలిసొచ్చిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన రామ్ చరణ్ , ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ ని అందుకున్నారు.. ఉపాసన డెలివరీ కోసం అపోలో హాస్పిటల్ లో చేరిన ఈమె ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఉదయం తెల్లవారుజామున ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చినట్లు జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ మెడికల్ బులిటెన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.

దీంతో కొనిదెల కామినేని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు ఇక మెగా ప్రిన్సెస్ రాకతో అటు చిరంజీవి తన భార్య సురేఖ సంబరాలలో మునిగి పోతున్నారు. ఉపాసన తల్లిదండ్రులు కూడా తెగ ఆనంద పడిపోతున్నారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈరోజు ఉదయం ఏడు గంటల తరువాత మెగా మరియు కామినేని కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిని సందర్శించి రామ్ చరణ్ ఉపాసనలకు పుట్టిన బిడ్డని ఆశీర్వదించబోతున్నట్లు సమాచారం.

అయితే గతంలో ఉపాసన , రామ్ చరణ్ కు కూతురు పుడితే అదృష్టం కలిసొచ్చి మరింత పేరు ప్రఖ్యాతలే కాకుండా డబ్బుపరంగా ఎలాంటి లోటు ఉండదని విషయాన్ని కొంతమంది పండితులు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రామ్ చరణ్ క్రేజ్ కూడా మరింత పెరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో రామ్ చరణ్ కూతురు వల్ల ఎంత అదృష్టం వస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం మెగా అభిమానులు సైతం తమ హీరో కూతుర్ని చూడాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ విషయానికి వస్తే RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు.. ప్రస్తుతం గేమ్ చేంజెస్ అనే చిత్రంలో నటిస్తున్నారు.