ఆ ఒక్క చిత్రమే కాజల్ కెరియర్ మార్చేసిందా..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ ను కొనసాగించింది.ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్. వివాహమైన తర్వాత కూడా పలు చిత్రాలలో నటిస్తే బిజీగా ఉంటోంది.. కాజల్ చందమామ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Kajal Aggarwal Feels “Hindi Cinema Lacks Ethics & Values” As She Chooses  South Industry Over Bollywood: “I Prefer The Eco-System”
ఈ సినిమా కాజల్ అగర్వాల్ కు స్టార్ స్టేటస్ ను సైతం అందుకునేలా చేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రంతోనే స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత స్టార్ స్టేటస్ ఉన్న క్రేజీ ప్రాజెక్టులకు సైతం ఓకే చెప్పి మంచి విజయాలను అందుకుంది. ఆ తర్వాత కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈమె కెరియర్లు ఎక్కువగా బ్లాక్ బస్టర్ విజయాలే ఉన్నాయని చెప్పవచ్చు. కాజల్ అగర్వాల్ ఒక్కో చిత్రానికి ప్రస్తుతం రూ.3 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

Amazon.com: Chandamama : Navdeep, Kajal Aggarwal, Nagababu, Siva Balaji,  Sindhu Menon, Ahuti Prasad, Krishna Vamsi, Akula Venkat, Lakshmi Bhupala,  Krishna Vamsi, Kalyan C.: Prime Video

ప్రస్తుతం బాలయ్యతో భగవంత్ కేసరి అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. కాజల్ కెరియర్లో చందమామ సినిమా ఆమె కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తరువాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ డమ్ అందుకొని స్టార్ స్టేటస్ అందుకుంది. ఒకవేళ చందమామ సినిమాని కాజల్ అగర్వాల్ రిజెక్ట్ చేసి ఉంటే ఈ చందమామ వెండితెరపై కనిపించేది కాదేమో..