మరొకసారి సంచలన ట్విట్ చేసిన అనసూయ..!!

ప్రముఖ యాంకర్ నటి అనసూయ బుల్లితెరపై కంటే ఇప్పుడు వెండితెర పైన ఎక్కువగా పాపులారిటీ సంపాదించింది. రంగస్థలం, పుష్ప ,రంగమార్తాండ, విమానం తదితర సినిమాలతో క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. అనసూయ ఈ మధ్యకాలంలో తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తనపైన వచ్చే ఎలాంటి విషయాలనైనా సరే తిప్పికొడుతూ ఉంటుంది.

కానీ గత కొద్ది రోజుల క్రితం నుంచి అనసూయ ఎలాంటి గొడవలకు వివాదాలకు తల దూర్చనని తనకు కూడా ఒక కుటుంబం ఉందని తనను వదిలేయండి అంటూ పలు రకాల ట్విట్లను షేర్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మళ్లీ మరొక సంచలన ట్వీట్ షేర్ చేయడం జరిగింది. అదేమిటంటే.. అందరికీ నమస్కారం గత కొద్దిరోజులుగా నాకు చాలా ట్విట్లు వస్తున్నాయి సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను అగౌరవపరిచినందుకు తన పేరు వాడుకుంటున్నారని తెలియజేసింది.

Anasuya Bharadwaj Biography : Family, Movielist, Age, Education

ఇలా చేయడం వల్ల తనకు అమర్యాదక, అగౌరవంగా ఉందని ఇది తన పేరును కించపరిచేలా కనిపిస్తోందని వీటితో తనకు ఎలాంటి సంబంధం లేదని కానీ అనవసరంగా తనను లాగినందుకు బాధ కలిగిందని తెలుపుతోంది.. తన లైఫ్ తనకు నచ్చిన విధంగా లీడ్ చేసుకుంటున్నాను.. నేను ఎవరి జోలికి వెళ్లాలనుకోవడం లేదు..నా స్వసక్తితో నేను ఎదిగిన మహిళగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అందరిలాగా నాకు పిఆర్ టీమ్స్ లేవు నన్ను ఎంకరేజ్ చేయడం ఇష్టం లేకపోతే నా నుంచి దూరంగా ఉండండి నాకు సంబంధం లేని విషయాలలో తన నా పేరు లాగకండి అంటూ నామీద దయ చూపండి అంటూ.. కాస్త మనసుల్లా ప్రవర్తించండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది అనసూయ. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారుతోంది.