రామ్ డ‌బ్యూ మూవీ `దేవదాసు`ను చీప్ రీజ‌న్ లో మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినే డ‌బ్యూ మూవీ `దేవ‌దాసు`. ఈ మూవీతోనే గోవా బ్యూటీ ఇలియానా కూడా హీరోయిన్‌గా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. వైవీఎస్ చౌదరి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. సాయాజీ షిండే, రమాప్రభ, ఎంఎస్ నారాయణ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

చ‌క్రీ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. 2006లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. రూ. 18 కోట్ల బడ్జెట్ తో నిర్మిత‌మైన దేవ‌వాసు.. లాంగ్ ర‌న్ లో రూ. 40 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అలాగే 17 థియేటర్లలో 175 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ త‌న ఎన‌ర్జీటిక్ పర్ఫామెన్స్ తో రామ్ అద‌ర‌గొట్టేశాడు. త‌న‌దైన న‌ట‌న‌, డ్యాన్సుల‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు.

అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. దేవ‌దాసు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ రామ్ కాదు. అవును, వైవీఎస్ చౌదరి మొద‌ట ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తో తీయాల‌ని అనుకున్నాడ‌ట‌. క‌థ కూడా అల్లు అర్జున్ కు బాగా న‌చ్చింద‌ట‌. కానీ, ఆయ‌న క‌థ‌లో కొన్ని మార్పులు చేయాల‌ని డైరెక్ట‌ర్ కు చెప్ప‌గా.. అందుకు వైవీఎస్ చౌదరి నో చెప్పాడ‌ట‌. దాంతో అల్లు అర్జున్ దేవ‌దాసు మూవీ చేయ‌న‌ని చెప్పాడ‌ట‌. ఇక అప్పుడు వైవీఎస్ చౌదరి ప్ర‌ముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ మేనల్లుడు రామ్ తో సినిమాగా.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.