రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న ముద్దుల కూతురు ఎన్ని వేల కోట్ల‌కు వారసురాలో తెలిస్తే మైండ్ బ్లాకే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన‌ పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. జూన్ 20వ తేదీన ఆమె మెగా లిటిల్ ప్రిన్సెస్ కు జన్మనిచ్చింది. పెళ్లయినా చాలా ఏళ్ల తర్వాత తల్లిదండ్రులకు ప్రమోట్ కావడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరోవైపు మెగా ఫ్యామిలీలో సైతం సంబరాలు మిన్నంటాయి. ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముద్దుల కూతురు ఎన్ని కోట్లకు వారసురాలో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చ‌ర‌ణ్ అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌డిగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబ‌ర్ స్టార్ గా గుర్తింపు పొందించాడు. రామ్ చ‌ర‌ణ్ పేరిట రూ. 1,130 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.

ఉపాస‌న విష‌యానికి వ‌స్తే.. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి మనువరాలు అయిన ఆమె చిన్న త‌నంలోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి సూప‌ర్ స‌క్సెస్ అయింది. ప్ర‌స్తుతం అపోలో హాస్పిట‌ల్స్ వైస్ ప్రెసిడెంట్ గా కొన‌సాగుతున్న ఉపాస‌న‌కు రూ. 1,370 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఈ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రి ఆస్తుల విలువ మొత్తం రూ. 2500 కోట్లు. ఇన్ని కోట్ల‌కు రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న కూతురు ఏకైక వార‌సురాలు అన్న‌మాట‌. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.