వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం జరిగేది అప్పుడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబంలో వరుసగా శుభా కార్యాలు జరుగుతూనే ఉన్నాయి.. గడిచిన కొద్దిరోజుల క్రితం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 20వ తారీఖున రామ్ చరణ్ ఉపాసనలకు పండంటి బిడ్డ కూడా జన్మించింది. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి వివాహం కూడా జరగబోతోంది అందుకు సంబంధించిన పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Hyderabad: Here's Lavanya Tripathi, Varun Tej's net worth
వరుణ్ తేజ్, లావణ్య ప్రేమించి మరి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే..వీరిద్దరూ కలిసి మిస్టర్ అనే చిత్రంలో అంతరిక్షం అనే చిత్రంలో నటించారు. మొదట మిస్టర్ అనే సినిమా సమయంలో అని వీరిద్దరూ ప్రేమలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు చాలాకాలం ప్రేమ గురించి అసలు బయట పెట్టలేదు ఎక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించలేదు.తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ బంధువుల సమక్షంలో సన్నిహితుల సమక్షంలోని జరిగింది. అయితే వీరి పెళ్లి గురించి వినిపిస్తున్న వార్తల ప్రకారం.. వీరి పెళ్లి ఇటలీలో జరగబోతోందని సమాచారం.

మిస్టర్ సినిమా షూటింగ్ కూడా ఇటలీలోనే జరిగిందట .ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. దీంతో వీరి వివాహం కూడా అక్కడే జరగబోతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.వరుణ్ తేజ్ ,లావణ్య పెళ్లి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహం కోసం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. లావణ్య త్రిపాఠి మాత్రం పులి మేక అనే వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత చిత్రాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం.